Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

చిత్రాసేన్
గురువారం, 6 నవంబరు 2025 (16:17 IST)
Vishwak Sen, Kayadu Lohar
కథానాయకుడు విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ఫంకీ. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న 'ఫంకీ' చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.
 
ఫంకీ సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే అద్భుతమైన బృందం ఒకచోట చేరింది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'జాతిరత్నాలు' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు. 
 
చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయికగా నటిస్తున్నారు. టీజర్ లో తన అందంతో కట్టిపడేశారు. తెరపై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. యువత మనసు దోచుకుంటోంది.
 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. అద్భుతమైన గీతాలు, నేపథ్య సంగీతంతో భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నారు. 
 
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, 'ఫంకీ'పై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments