Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

Advertiesment
Kayadu Lohar

సెల్వి

, సోమవారం, 26 మే 2025 (17:40 IST)
Kayadu Lohar
తమిళనాడు టాస్‌మాక్ స్కామ్‌లో కీలక పాత్ర వున్న వ్యక్తులతో డ్రాగన్ బ్యూటీ కాయదుకు సంబంధం వుందని.. వీరు నిర్వహించే పార్టీలకో హాజరయ్యేందుకు ఒక్క రాత్రికి రూ.35 లక్షలు డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.  కాయదు లోహర్ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అయితే ఈ ఆరోపణలు రుజువు కాలేదు. మద్యం వ్యాపారంతో సంబంధం, లంచం, చట్ట విరుద్ధ ఆర్థిక లావాదేవీల్లో కాయదుకు సంబంధం వుందా అనేది తెలియరాలేదు. కానీ కెరీర్ పీక్స్‌లో వున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న కాయదుకు ఆఫర్లు సన్నగిల్లుతాయని సినీ పండితులు అంటున్నారు. 
 
ఒక్క సినిమాతోనే తన అందచందాలు, నటనతో యూత్‌ను కట్టిపారేసిన కాయదుకు ఇలాంటి ఆరోపణలు రావడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై ఆమె ఫ్యాన్సుగా వుండమని చెప్తున్నారు. కాయదు వ్యవహారం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. 
 
అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన కయాదు లోహర్ 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత ఆమె మలయాళ చిత్రాలైన పథోన్‌పథం నూత్తండు, తెలుగు చిత్రం అల్లూరి ఒరు జాతి జాతకంలలో నటించింది. 
Kayadu Lohar
 
మరాఠీ చిత్రం ఐ ప్రేమ్ యులో కూడా కనిపించింది. ఆమె డ్రాగన్‌తో విజయం సాధించింది. ఇందులో ఆమె ప్రదీప్, అనుపమ పరమేశ్వరన్, మిస్కిన్‌లతో కలిసి పల్లవి పాత్రను పోషించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమెను స్టార్‌డమ్‌కు చేర్చింది. ఆమె ఇప్పుడు తన తదుపరి పెద్ద విడుదల STR49 కోసం శింబుతో కలిసి పనిచేసేందుకు పాటు సిద్ధమవుతోంది.
Kayadu Lohar
 
ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్‌లో సంబంధాలున్న వ్యక్తితో లోహర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై లోహార్ న్యాయవాద బృందం లేదా ప్రతినిధుల నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ, ఈ పరిణామం సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో విస్తృత చర్చకు దారితీసింది. లోహర్ త్వరలోనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తుందని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిరాయ్ కోసం రైలు పైన నిలబడి రిస్కీ స్టంట్ చేసిన తేజ సజ్జా