Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

దేవి
సోమవారం, 10 మార్చి 2025 (17:37 IST)
Vishnu Manchu, Preethi Mukundan
హీరో విష్ణు మంచు‘కన్నప్ప’పై  శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.
 
విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.
 
శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments