Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

Advertiesment
Kannappa new
Kannappa new
శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను ఆధారంగా చేసుకుని విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
 
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లోని ఒక్కో షాట్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్, శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించిన తీరు.. టీజర్ చివర్లో రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ.. ఆ క్లోజప్ షాట్స్‌కు అభిమానులతో పాటుగా, సినీ లవర్స్ అంతా ఫిదా అయ్యేలా ఉంది.
 
ఈ రెండో టీజర్‌తో కన్నప్ప మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ