Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Advertiesment
Vishnu- siva siva song

దేవి

, మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (18:35 IST)
Vishnu- siva siva song
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘శివా శివా శంకరా’ అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను 80 మిలియన్ల (8 కోట్ల) మంది వీక్షించారు. ఇక ఇన్ స్టాగ్రాంలో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు.
 
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ పాట ఆకట్టుకుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ట్రెండ్‌లో చేరి రీల్స్‌తో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం శివ నామస్మరణే కనిపిస్తోంది. అంతటా శివా శివా శంకరా’ అనే పాటే వినిపిస్తోంది.
 
మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు-నిర్మాత విష్ణు మంచు మాట్లాడుతూ.. ’శివా శివా శంకరా’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్  అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థం అవుతోంది’ అని అన్నారు.
 
శివభక్తుడైన కన్నప్ప పురాణ కథను అందరి ముందుకు తీసుకు రాబోతున్నారు. క్లిష్టమైన కథనాన్ని, అద్భుతమైన విజువల్స్, అసాధారణమైన సమిష్టి తారాగణంతో అద్భుతంగా తెరకెక్కించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా.. రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన