Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో చెడు సంస్కృతి పెరుగుతోంది : విశాల్ ఆందోళన

తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. తమిళ దర్శకనిర్మాత అశోక్ కుమార్ బుధవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై విశాల

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (14:39 IST)
తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. తమిళ దర్శకనిర్మాత అశోక్ కుమార్ బుధవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై విశాల్ ఓ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఇందులో అశోక్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని లేఖలో ఆరోపించాడు. ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్ల అశోక్ ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమన్నాడు. అప్పుల బాధను తట్టుకోలేక చేసుకునే ఆత్మహత్యల్లో ఇదే చివరిది కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఫైనాన్షియర్ల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరాడు. 
 
ఫైనాన్షియర్ల వేధింపులకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని విశాల్ పిలుపునిచ్చాడు. నిర్మాతల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలసికట్టుగా పని చేయాలని కోరాడు. అమాయకుల మరణాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశాడు. దీన్ని ఆత్మహత్యగా కాకుండా, హత్యగా పరిగణించాలని కోరాడు.
 
కాగా, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అశోక్‌కుమార్ మంగళవారం రాత్రి స్థానిక చెన్నై ఆళ్వార్ తిరునగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. తన చిత్రాల కోసం ఫైనాన్షియర్ల వద్ద అప్పులు తీసుకోవడం, వాటిని తిరిగి చెల్లించలేక పోవడంతో ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడితో పాటు బెదిరింపులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments