Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరకట్టులో అదిరిపోయిన సమంత.. స్టిల్స్ చూడండి

టాలీవుడ్ అగ్రహీరోయిన్, కొత్త పెళ్లి కూతురు సమంత తాజా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత చీరకట్టులో కనిపించింది. ఈ ఫోటోలకు షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటుడు విశాల్

Advertiesment
చీరకట్టులో అదిరిపోయిన సమంత.. స్టిల్స్ చూడండి
, శనివారం, 18 నవంబరు 2017 (10:00 IST)
టాలీవుడ్ అగ్రహీరోయిన్, కొత్త పెళ్లి కూతురు సమంత తాజా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత చీరకట్టులో కనిపించింది. ఈ ఫోటోలకు షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు‌గా రిలీజ్ కానుంది. 
 
పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ నవంబర్ 18న విడుదల చేస్తున్నట్టు టీం ప్రకటించింది. 
 
ఇంతలోనే సమంత ఈ చిత్రంలోని తన స్టిల్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ఇక ఈ సినిమా పాటలు డిసెంబర్ 27న విడుదల కానుండగా, జనవరి 13న మూవీని రిలీజ్ చేయనున్నారు. యువన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌మంత చీరకట్టులో ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈఈబీఎఫ్‌ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పవన్ కల్యాణ్