అవన్నీ పుకార్లే... విశాల్ ఫిల్మ్ ఆఫీస్‌లో జీఎస్టీ సోదాలేం జరగలేదు
తమిళ హీరో విశాల్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించిన ఘటనపై డైరెక్టరేట్ 'జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్' చెన్నై జోనల్ యూనిట్ స్పందించింది. అసలు అలాంటి సోదాలేం జరగలేదని స్పష్టంచేసింది.
తమిళ హీరో విశాల్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించిన ఘటనపై డైరెక్టరేట్ 'జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్' చెన్నై జోనల్ యూనిట్ స్పందించింది. అసలు అలాంటి సోదాలేం జరగలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను జాయింట్ డైరెక్టర్ పేరుతో రిలీజ్ చేశారు. పైగా, మీడియాలో వచ్చిన వార్తలు తప్పుడువని జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ పేరుతో విడుదలైన ప్రకటనలో స్పష్టంచేశారు.
కాగా, అంతకుముందు హీరో విశాల్ ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారంటూ మీడియాలో వార్తలువచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దుమారం లేచింది. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాపై చేసిన వ్యాఖ్యల వల్లే… విశాల్ ఇళ్లపై సోదాలు జరిగాయని ప్రచారం జరిగింది.
దీంతో జీఎస్టీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో మరోసారి చర్చ ప్రారంభమైంది. అసలు సోదాలు జరిగాయా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.