తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలు
సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయనుంది. తద్వారా వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను
సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయనుంది. తద్వారా వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను ఆపరేట్ చేయడం మరింత సులభతరం అవుతుంది.
ఈ భాషలు ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ యాప్‌తో పాటు జీబోర్డు యాప్‌ల్లోనూ పనిచేస్తాయని, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ, గుజరాతీ. మరాఠీ, ఉర్దూ వంటి ఉత్తరాది భాషల్లోనూ ఈ వాయిస్ సెర్చ్ అందుబాటులో వుంటుంది.
ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల వరకే పరిమితమైన గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలను మరో 30 భాషల్లో అందించేందుకు గూగుల్ సెర్చ్ సిద్ధమవుతోంది. ఈ సేవను ఉపయోగించుకోవాలంటే సెట్టింగ్స్‌లో వాయిస్ మెనూలో తమ ప్రాంతీయ భాషకు ఆప్షన్ మార్చుకోవాలి.
ఈ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి సౌకర్యంగా వుంటుందని.. తద్వారా స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.