Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

దేవీ
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (19:26 IST)
Virgin Boys poster
ఈ సమ్మర్ సీజన్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వర్జిన్ బాయ్స్' సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. గీతానంద్-మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యువతను ఆకర్షించే కథాంశంతో హాట్ టాపిక్‌గా మారింది. స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ లాంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.
 
సినిమా పోస్టర్ చూస్తుంటేనే దాని ఫన్ ఎలిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఓ అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే చాలా క్రేజీ వైబ్స్ వస్తున్నాయి. ఈ పోస్టర్ లో అమ్మాయి పెదాలపై ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, మరోకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఈ సినిమా యొక్క హాస్య రాగాన్ని సూచిస్తోంది. 'బ్రో.. ఆర్ యు వర్జిన్?' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా యువతలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
 
ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం భారీ ఎత్తున ప్రమోషన్‌లు చేస్తోంది. ఈ సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యువకుల మధ్య నడిచే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించే అవకాశం ఉంది.మొత్తానికి పోస్టర్ అంచనాలను పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా భారీ హిట్ కానుందని తెలుస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments