Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ టైటిల్ మహాకాళి

Mahakali first look

డీవీ

, గురువారం, 10 అక్టోబరు 2024 (21:20 IST)
Mahakali first look
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి ఫస్ట్ మూవీ 'హనుమాన్', క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రచన, దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ PVCU నుంచి 3వ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఆర్‌కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. 
 
RKD స్టూడియోస్ భారతదేశంలోని ప్రముఖ మూవీ నిర్మాణం, పంపిణీ, కొనుగోలు సంస్థ, ఈ చిత్రంతో నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాల బ్లెండ్ తో ఈ సినిమా వుండబోతోంది. ఇది భారతదేశం నుండి వస్తున్న ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో, యూనివర్స్ లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో మూవీ.
 
ఈ చిత్రానికి బెంగాల్ యొక్క గొప్ప సాంస్కృతిక బ్యాక్ డ్రాప్ వున్న "మహాకాళి" అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఇండియన్ సినిమాని రిడిఫైన్ చేసేలా వుండబోతోంది. కాళీ దేవికి అనుసంధానించబడిన ప్రాంతం బెంగాల్‌ సెట్ చేయబడిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్‌గా గ్రిప్పింగ్ కథనంతో వుండబోతోంది. 
 
అనౌన్స్మెంట్ పోస్టర్ లో పోస్టర్‌లో ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు ఉంది. ఈ నేపథ్యంలో గుడిసెలు, దుకాణాలు కనిపిస్తూ ప్రజలు భయాందోళనకు గురవుతూ కనిపించారు. ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చూడవచ్చు. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారం కనిపిస్తోంది. పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది, ప్రొడక్షన్‌లో గొప్పతనాన్ని సూచిస్తుంది.
 
"మహాకాళి" సాధికారత, విశ్వాసం యొక్కఎపిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. కాళీ దేవి యొక్క ఉగ్రమైన, దయగల స్వభావం నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం భారతీయ మహిళల వైవిధ్యాన్ని, వారి అచంచలమైన స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకునేలా వుండబోతోంది.  
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను తర్వాత తెలియజేస్తారు మేకర్స్. 
 
IMAX 3Dలో మహాకాళిని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు, ఇండియన్, ఫారిన్ భాషలలో ఈ సినిమాని విడుదల కానుంది. హనుమాన్ ఇటీవల జపాన్‌లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరువీర్ హీరోగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంఛ‌నంగా ప్రారంభం