Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

దేవీ
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (19:18 IST)
Nani, Srinidhi Shetty
నేచురల్ స్టార్ నాని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్ తో ప్రారంభమయ్యాయి. నాని, శ్రీనిధి శెట్టి ఈ పాటలో డాజ్లింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ రోజు, మేకర్స్ సెకెండ్ సింగిల్ - అబ్కీ బార్ అర్జున్ సర్కార్‌ రిలీజ్ చేశారు.
 
ఈ పాట అర్జున్ సర్కార్ పాత్రకు ప్రాణం పోసింది. ఇది అతని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది, ఈ సాంగ్ అతని ఫెరోషియస్ ఎనర్జీని సూచిస్తోంది. అతను తన శత్రువులకు  పీడకల, తప్పుకు ప్రతీకారం తీర్చుకునే కఠినమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యంతో అతని పాత్ర సారాంశాన్ని పాట ద్వారా అద్భుతంగా చూపించారు.
 
మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే ట్రాక్‌ను, ఎలక్ట్రిఫైయింగ్ ఆర్కెస్ట్రేషన్ తో కంపోజ్ చేశారు, అనురాగ్ కులకర్ణి  డైనమిక్ వాయిస్ సాంగ్ ని మరోస్థాయికి తీసుకెళుతుంది. నాని కమాండింగ్ ప్రజెన్స్, సాంగ్ లో ఇంటెన్స్ ఎనర్జీని నింపుతుంది. అర్జున్ సర్కార్  ఎసెన్స్ ని  కంప్లీట్ గా ప్రజెంట్ చేసే అడ్రినలిన్-చార్జ్డ్ యాంథమ్ ని క్రియేట్ చేస్తోంది.
 
సాను జాన్ వర్గీస్ మ్యాజికల్ కెమరా వర్క్ అందిస్తూ, ప్రతి మూమెంట్ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
 
ఏప్రిల్ 14న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పాట ద్వారా అనౌన్స్ చేశారు. HIT: The 3rd Case మూవీ మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments