Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

దేవీ
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (18:32 IST)
Sharwanand, Samyukta
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మురారి. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ఫస్ట్ సింగిల్ మ్యాజికల్ రొమాంటిక్ మెలోడీ దర్శనమే రిలీజ్ చేశారు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ దర్శనమే రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
 
విశాల్ చంద్ర శేఖర్ దర్శనమే కోసం క్లాసిక్ మెలోడీ ని ఫ్రెష్ బీట్స్ తో అద్భుతంగా కంపోజ్ చేశారు. మనసుని కట్టిపడేసే ట్రాక్ ఇది. యాజిన్ నిజార్ వోకల్స్  పాటను మరో స్థాయికి తీసుకెళ్తాయి, అతని వాయిస్ మెస్మరైజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శర్వా ఎమోషన్స్ అద్భుతంగా వర్ణిస్తుంది.  
 
స్క్రీన్ పై శర్వా చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది. సంయుక్త అందంగా కనిపిస్తుంది. శర్వాతో మ్యాజికల్ కెమిస్ట్రీని పంచుకుంటుంది. వారు తమ ప్రేమకథను ప్రేక్షకులను అలరించే విధంగా పెర్ఫామ్ చేశారు.
 
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాశారు, నందు సావిరిగణ సంభాషణలను అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments