Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

Advertiesment
Sharva,  Samyukta

దేవీ

, సోమవారం, 31 మార్చి 2025 (13:21 IST)
Sharva, Samyukta
శర్వా, సాక్షి వైద్య, సంయుక్త నాయికా నాయకులుగా నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మురారి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో రూపొందుతోంది.
 
ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ఏప్రిల్ 7న విడుదల కానున్న శర్వా, సంయుక్త నటించిన దర్శనమే అనే పాటతో ప్రారంభమవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
 
సాంగ్ పోస్టర్ లో శర్వా, సంయుక్త రొమాంటిక్ బైక్ రైడ్ ఆస్వాదిస్తున్నారు. శర్వా క్యాజువల్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంటులో చాలా స్టైలిష్ గా కనిపిస్తుండగా, సంయుక్త తన సాంప్రదాయ దుస్తులలో అందంగా వుంది
 
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాశారు, నందు సావిరిగణ సంభాషణలను అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ