Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థ్రిల్లర్‌, సందేశాన్ని, అవగాహనను కల్పించేలా సుడల్ సీజన్ 2

Advertiesment
Sudal Season 2 poster

దేవి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:17 IST)
Sudal Season 2 poster
అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన సుడల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు సామాజిక సందేశాన్ని, అవగాహనను కల్పించేలా తీసిన ఈ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తీసిన ఈ వెబ్ సిరీస్‌ను వాల్‌వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇక ఇప్పుడు సుడల్ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బ్రహ్మ, సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన సుడల్ సీజన్ 2పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
 
కథిర్, ఐశ్వర్య రాజేష్, గౌరీ కిషన్, సంయుక్త, మోనిషా బ్లెస్సీ, లాల్, శరవణన్, మంజిమా మోహన్, కయల్ చంద్రన్, చాందిని, అశ్విని వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. సామ్ సిఎస్ అందించిన సంగీతం ఈ సిరీస్‌కు మరో హైలైట్. ఇందులో 9 పాటలు, ఆర్ఆర్ సిరీస్‌ను ఎలివేట్ చేసేలా ఉంటాయి. టి-సిరీస్ ద్వారా మార్కెట్లోకి ఆల్బమ్ వచ్చేసింది. సుడల్ సీజన్ 1 సెటప్, సిరీస్ మేకింగ్, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ కదిలించింది. ది వెరైటీ మ్యాగజైన్ ద్వారా 2022 టాప్ 10 బెస్ట్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లలో సుడల్‌కి కూడా చోటు దక్కింది. 
 
పుష్కర్, గాయత్రి కథను చెప్పడంలో మాస్టర్లుగా మారిపోయారు. వీరు సీజన్ 2తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు వచ్చారు. సస్పెన్స్‌తో పాటుగా, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇచ్చేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naveen Polishetty: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానిగా నవీన్‌ పోలిశెట్టి పై థియేటర్‌ లో షూట్‌ !