Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naveen Polishetty: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానిగా నవీన్‌ పోలిశెట్టి పై థియేటర్‌ లో షూట్‌ !

Advertiesment
Naveen polishetty, theater

దేవి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:10 IST)
Naveen polishetty, theater
హీరో అభిమాని హీరో అయితే చాలా చిత్రంగా వుంటుంది. ఇప్పటి జనరేషన్‌ అంతా  గతంలో ఏదో ఒక సినీ హీరోకు  అభిమానులే. అలాగే నవీన్‌ పోలిశెట్టి కూడా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానే. తన సినిమాల ప్రమోషన్‌ ని ప్రభాస్‌ ద్వారా చేయించిన సందర్భాలున్నాయి. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న కేరెక్టర్‌ వేసి ఆ తర్వాత తన నటనతో కథానాయకుడి స్థాయికి ఎదిగి, అనుష్క కాంబినేషన్‌ లో మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి పేరుతో సినిమా చేసి సక్సెస్‌ సాధించుకున్నారు. కొంత గేప్‌ తీసుకున్న ఆయన తాజాగా `అనగనగా రాజు` అనే పేరుతో సినిమా చేస్తున్నారు.
 
కాగా, ఈ సినిమా  ఫిబ్రవరి 24న నవీన్‌ పోలిశెట్టి తో కొన్ని సీన్స్ పాలకొల్లులోని గీత అన్నపూర్ణ థియేటర్‌ లో షూట్‌ చేశారు. ఆ థియేటర్‌లో బాహుబలి సినిమా ప్రదర్శన జరుగుతుంది. ఆ సినిమా చూడడానికి థియేటర్‌ కు వస్తారు. అనంతరం సినిమా చూశాక బయటకు వచ్చి ఊరేగింపుగా సూపర్‌ డూపర్‌ హిట్‌ అంటూ అభిమానుల మధ్య కేరింతలు వేస్తారు. రాజమండ్రి లో 15 రోజుల షూటింగ్ చేసాక తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ చేయనున్నారు.
 
ఈ సినిమాకు  తమిళ దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు  వీరాభిమానిగా నవీన్‌ పోలిశెట్టి నటిస్తున్నారు. ఒక అభిమాని తను ఏదైనా చేయాలనుకుంటే హీరోను స్పూర్తిగా తీసుకుని ఎలా చేశాడనే పాయింట్‌ తో ఈ సినిమా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
బాహుబలి రిలీజ్‌ నాటి కథకు వర్తమానాన్ని లింక్‌ చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎన్ని  విశేషాలున్నాయో వెయిట్‌ అండ్‌ సీ. కాగా, ఈ సినిమాని సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ మోసం: తమన్నా, కాజల్ అగర్వాల్‌లను పోలీసులు ప్రశ్నించాలి?