Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Advertiesment
Nani- Hit 3

దేవి

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (14:56 IST)
Nani- Hit 3
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా సర్కార్స్ లాఠీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 
 
పోలీసులను కలవరపెట్టే వరుస రహస్య హత్యల నేపధ్యంలో టీజర్ మొదలౌతుంది. వారు ఎంత ప్రయత్నించినా హంతకుడిని పట్టుకోవడంలో విఫలమవుతారు. చివరి ప్రయత్నంగా టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్ ని ఆశ్రయిస్తారు.
 
నాని అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కట్టిపడేశారు. బ్రూటల్, కనికరంలేని పాత్రలో ఆదరగొట్టారు. అతని ఇంటెన్స్ ప్రజెన్స్, యాంగర్ టెర్రిఫిక్ గా వున్నాయి. ముఖ్యంగా ఓ సన్నివేశంలో అతను నేరస్థుడిని పొడిచి కత్తిని పైకి లాగడం, రూఫ్ పై రక్తం చిమ్ముడం - అతని పాత్ర క్రూరత్వాన్ని హైలెట్ చేస్తోంది. 
 
దర్శకుడు శైలేష్ కొలను HIT సిరీస్‌ను అద్భుతమైన కథనం, గ్రేట్ విజువల్స్‌తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. నాని పెర్ఫార్మెన్స్ సినిమాకి మరింత డెప్త్ ని యాడ్ చేసింది. 
 
సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ఇంపాక్ట్ ని మరింత పెంచుతుంది. ప్రశాంతి తిపిర్నేని, నాని ప్రొడక్షన్స్ వాల్యూస్ అత్యున్నతంగా వున్నాయి. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు.
 
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న HIT: ది 3rd కేస్ మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?