కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్` జూన్3న విడుదలై విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. తెలుగు, తమిళ రాష్ట్రంలోనూ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తమ స్వంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి సక్సెస్‌ను సాధించారు. ఈ సందర్భంగా గురువారంనాడు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పలు విషయాలను తెలియజేశారు.
`విక్రమ్` తీసుకున్నప్పుడు మీరేమనుకున్నారు? ఇప్పుడు ఎలా వుంది?
కమల్ హాసన్ అభిమాని అయిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖచ్చితంగా మంచి సినిమా అనే నమ్మకం కలిగింది. ఒక అభిమాని దర్శకుడు అయి సినిమా తీస్తే ఎలా వుంటుందనేది హరీష్ శంకర్ ద్వారా తెలుసుకున్నాం. అప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ రెండు హిట్ సినిమాలు ఇచ్చాడు. కాబట్టే విక్రమ్ మనమే రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కమల్ గారు మమ్మల్ని నమ్మి ఇచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది.
సినిమా చూసి తీసుకున్నారా?
సినిమా చూడలేదు. కేవలం దర్శకుడిపై నమ్మకంతో తీసుకున్నాం.
విక్రమ్ సినిమా తీసుకోవడానికి ఇద్దరు, ముగ్గురు పేర్లు వినిపించాయి. కమల్‌గారు కూడా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అయితే బాగుంటుందని అనుకున్నారు? మీకు దక్కడం ఎలా అనిపించింది?
ఇద్దరు, ముగ్గురు పోటీకి వచ్చారు. కానీ ఆయన మాపై నమ్మకంతో మాకు తక్కువగానే ఇచ్చారు. ఈ సినిమాను 370 నుంచి 400 స్క్రీన్లలో వేశాం. థియేటర్లు పెరగలేదుకానీ మల్టీప్లెక్స్ షోలు పెరిగాయి. మౌత్ టాక్‌తో మొదటిరోజు నంచే కలెక్షన్లు బాగున్నాయి. నేటికీ అలానే వున్నాయి.
విక్రమ్ కథ గురించి తెలుసుకున్నారా? మరి పోటీ పడి తీసుకోవడానికి కారణం?
ఇది దర్శకుడి సినిమా. దర్శకుడు స్టఫ్ నాకు బాగా తెలుసు. పైగా కమల్ హాసన్ గారి స్వంత బేనర్ రాజ్‌కమల్ సంస్థలో ప్రతిష్టాత్మకంగా తీశారు. ఇంకోవైపు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి ప్రముఖుల కాంబినేషన్‌కూడా ఓ కారణం.
కమల్ హాసన్ కు ఈమధ్య సక్సెస్ లేవుకదా. విక్రమ్ కు రిస్క్ వుంటుందని అనుకున్నారా?
తెలుగు పరిశ్రమ క్లిప్టపరిస్థితిలో వుంది. ప్రేక్షకులు థియేటర్లకు ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి టైంలో డబ్బింగ్ సినిమా రిలీజ్ ఎలా చేయాలనిపించింది?
ముఖ్యంగా దర్శకుడు అంతకుముందు తీసిన, ఖైదీ, మాస్టర్ సినిమా చూశాక నాకు మంచి నమ్మకం వచ్చింది. దానికితోడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వున్నారంటే పెద్ద సినిమా అవుతుందని నమ్మకం కలిగింది.
నితిన్ సలహా ఇచ్చారా?
ట్రైలర్ చూశాక తీసుకోండి డాడీ అన్నారు.
పాన్ ఇండియా సినిమా మీకు పోటీ అనిపించలేదా?
అనిపించలేదు. మంచి సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం వుంది. మేజర్‌తోపాటు మా సినిమా ఆడింది.
ఓటీటీ ప్రభావం ఎంత ఉండబోతోంది?
ఏదైనా థియేటర్ అనుభవమే వేరు. అక్కడ చూస్తేనే ఆనందంగా వుంటుంది. ఓటీటీలో చిన్న స్క్రీన్‌లో చూస్తే అంత ఎఫెక్ట్ వుండదు.
ఈమధ్య కమల్‌గారిని కలిశారా?
కలిశాను. చాలా ఆనందంగా వున్నారు. ఆయన ఈమధ్య ఈ సినిమాకు తిరిగినంతగా దేశమంతా ఎప్పుడూ తిరగలేదు.
మీకు కమల్‌హాసన్‌గారు గిఫ్ట్ ఇచ్చారా?
(నవ్వుతూ) మేమే ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి. ఆయన మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. కరెక్ట్ పర్సన్ అని నమ్మి ఇచ్చారు. మార్నింగ్ షోనుంచే మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్‌గా సెలెక్టివ్‌గా ఉంటున్నారే?
నైజాంలో ఇద్దరే పంపిణీదారులు వున్నారు. ఆంధ్రలో అలాకాదు. ఏరియాకు ఒకరున్నారు. ఇక్కడకు వచ్చే సరికి ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి. రిస్క్ ఎక్కువ. బడ్జెట్ కంట్రోల్‌పెట్టుకోవాలి. 50 కోట్లు పెట్టి కొంటే తేడా వస్తే సగంపైగా పోతుంది. అందుకే బాగా ఆలోచించి దిగాల్సి వస్తుంది.
పూర్తిస్థాయిలో పంపిణీరంగంలో మరలా వస్తారా?
మంచి సినిమాలు వుంటే చేస్తాను.
నిర్మాతలకు ఏడాదికేడాది సమస్యలు పెరుగుతున్నాయి. వాటిని సాల్వ్ చేసుకుంటున్నారా?
నిర్మాతలకు ప్రతిసారీ సమస్యలు రావడం అనేది సహజం. వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోవాలి.
డిస్ట్రిబ్యూటర్‌గా ఏ ప్రాతిపదికన సినిమా తీసుకుంటారు?
కథలోని లైన్, దర్శకుడు, హీరో, బేనర్ ఇలా పలు అంశాలు పరిగణలోకి తీసుకుంటాం.
విక్రమ్ సినిమా సక్సెస్‌కు ఏఏ అంశాలు వర్కవుట్ అయ్యాయని అనుకుంటున్నారు?
నటీనటులు, ఫైట్ మాస్టర్, సంగీత దర్శకుడు వీరంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మొదటి భాగంలో కమల్ కనిపించరు. కానీ తానున్నట్లు గ్రిప్పింగ్‌లో పెట్టాడు. ఫైనల్‌లో సూర్యను తెచ్చి హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో కామెడీ, పాటలు ఏమీ లేవు. అయినా థియేటర్‌లో ప్రేక్షకుల్ని కూర్చోపెట్టాడడంటే అదంతా దర్శకుని స్రీన్ల్‌ప్లే కారణం.
విక్రమ్ సీక్వెల్ గురించి ఏమైనా మీతో మాట్లాడారా?
ఏమీ చెప్పలేదు. దర్శకుడు ఇప్పుడు విజయ్‌తో సినిమా చేస్తున్నాడు.
ఆ దర్శకుడితో నితిన్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారా?
దర్శకుడు బిజీ కాబట్టి ఏమీ అనుకోలేదు. అయినా కథ వర్కవుట్ కావాలి.
థియేటర్‌కు పూర్వ వైభవం వచ్చిందంటారా?
వచ్చింది. ముఖ్యంగా టికెట్ల రేట్లు హెవీగా పెంచకూడదనేది నా పాలసీ. ఏదో బడ్జెట్ పెరిగిందని పెంచడం అర్థంలేనిది. ఇప్పుడు తగ్గించాం అని అంటున్నారు. పెంచడం వల్ల ప్రేక్షకుడు మూడు వారాలకే ఓటీటీకి వచ్చేస్తుందకదా అనే ఆలోచనలో వున్నారు.
కొంతమంది ఎక్కవ రేటు పెట్టి తప్పటడుగుదేశారని టాక్ వుంది?
మేం ప్రభుత్వాలను అడిగాం. 200 నుంచి 350 వరకు పెంచుకోవచ్చవని వారు చెప్పారు. కానీ డైరెక్ట్‌గా 350 రేటు పెట్టేశారు. నేను మాత్రం 200రూ. రేటు పెట్టాను. ఇంతకుముందు బాహుబలి2 నైజాంలో 55 కోట్లు నార్నల్ రేటులోనే వసూలు చేసింది. మరి ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారో అర్థంకావడంలేదు. పెంచడం వల్ల రెండు, మూడు సార్లు చూసేవారు, ఫ్యామిలీస్ థియేటర్ రాకపోవడంతో నష్టపోతున్నారు.