సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ ఊపందుకున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి, ఎం.ఎం.శ్రీలేఖ తన సోషల్ మీడియా ఫొటోను పోస్ట్ చేసారు. రాజమౌళి తండ్రి రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
"ప్రసాద్ నాన్న గారూ, రాజమౌళి అన్న, మహేష్ బాబుల క్రేజీయస్ట్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కోసం ఆల్ ది బెస్ట్. నేనూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని శ్రీలేఖ రాశారు. కాగా, ఈ క్రేజ్ ప్రాజెక్ట్‌పై గతంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో సూచాయగా చెబుతూ, త్వరలో హాలీవుడ్ స్థాయిలో మహేష్‌బాబుతో సినిమా వుండబోతోందని వెల్లడించారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్ర కథ గురించి బుధవారంనాడు స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించినట్లు అర్థమవుతుంది. ఇక ఈ కథ ఓ హాలీవుడ్ కథను స్పూర్తిగా తీసుకుని చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అభిమానులకు పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.