Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విభాషల్లో నిర్మితమవుతున్న "అగ్నిప్రవ" చిత్రం ప్రారంభం

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (19:49 IST)
నవరత్న పిక్చర్స్  బ్యానర్‌పై వర్ష తమ్మయ్య నిర్మాతగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం "అగ్నిప్రవ". సురేష్ ఆర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్త కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా "బాహుబలి" రైటర్ విజయేంద్ర ప్రసాద్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమార్తె లక్ష్మీ, అల్లుడు గోవింద రాజు, ప్రముఖ కన్నడ దర్శకులు జో సైమన్ విచ్చేశారు. 
 
అనంతరం "బాహుబలి " రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'మా వ్యాయామ శాల(టీం)లో తయారైన శిష్యుడి కథ విని చాలా సంతోష పడ్డాను. మొదటి చిత్రానికి మంచి కథ తయారు చేసుకున్నాడు సురేష్ ఆర్య. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు.
 
నిర్మాత  వర్ష తమ్మయ్య మాట్లాడుతూ, తెలుగులో ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించాను. కన్నడ, తెలుగు భాషల్లో మొదటిసారిగా నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం"అగ్నిప్రవ" మహిళా ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంబంలో జరిగే దౌర్జన్యం, అణిచివేతపై విరుచుకుపడే కెరటంలా" అగ్నిప్రవ" చిత్రం ఉంటుందని తెలిపారు. మా చిత్ర ప్రారంభానికి విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలన్నారు.
 
చిత్ర దర్శకుడు సురేష్ ఆర్య మాట్లాడుతూ, విజయేంద్ర ప్రసాద్ టీంలో పనిచేసిన అనుభవంతో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నానని.. విజయేంద్ర ప్రసాద్ అన్న. రాజమౌళి పెద్దనాన్న. ఎస్.ఎస్.దత్తతో కలిసి ఈ మూవీ కథ చర్చించామని తెలిపారు. రగిలే అగ్ని జ్వాలల స్వభావం ఉన్న నాయకిగా వర్ష తమ్మయ్య నటిస్తున్నారు. ఈ చిత్రానికి "అగ్నిప్రవ" టైటిల్ పెట్టాము. 
 
డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టి. కూర్గ్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని దర్శకుడు సురేశ్ ఆర్య తెలిపారు. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకులు జో సైమన్ కుమారుడు జితేంద్ర సైమన్ మాట్లాడుతూ, తెలుగు, కన్నడ భాషల్లో "అగ్నిప్రవ" చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం అందరికి నచ్చేవిధంగా ఉంటుంది. విజయవంతమై అందరికి మంచి పేరు రావలని కోరుకుంటున్నా అన్నారు. ప్రముఖ దర్శకులు జో సైమన్ మాట్లాడుతూ, యంగ్ టీం అంతా కలిసి చేస్తున్న "అగ్నిప్రవ" చిత్రం పెద్ద విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 
 
బ్యానర్ : నవరత్న పిక్చర్స్
సమర్పణ : మ్యాక్స్ వరల్డ్
నిర్మాత : వర్ష తమ్మయ్య
సహా నిర్మాత : జితేంద్ర సైమన్
దర్శకత్వం : సురేష్ ఆర్య
పాటలు : ఎస్.ఎస్. దత్త, డా.రామకృష్ణ, కోడూరి
కథ : ఉదయ్ శెట్టి, యువ, సురేష్ ఆర్య
కెమెరా : లవిత్
ఎడిటింగ్ : కె.సి.బి.హరి
డాన్స్ : ఆజాద్ సర్ధారియా, గోకులానంద్
ఫైట్స్ : డిఫరెంట్ డాని
ఆర్ట్ : వేణుగోపాల్

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments