Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భారీ తారాగణం' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభం!

Advertiesment
'భారీ తారాగణం' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభం!
, గురువారం, 19 నవంబరు 2020 (17:24 IST)
బివిఆర్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న 'భారీ తారాగణం' చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో హీరోయిన్లపై తొలి షాట్  క్లాప్ నిర్మాత అచ్చి రెడ్డి కొట్టగా కెమెరా స్విచ్ఆన్ ఎస్వీ.కృష్ణారెడ్డి చేశారు. తొలి షాట్ గౌరవ దర్శకత్వం నటుడు అలీ చేయగా జ్యోతి ప్రజ్వలన సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్.శ్రీలేఖ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు.
 
డైరెక్టర్ శేఖర్ ముత్యాల మాట్లాడుతూ... భారీ తారాగణం సినిమా ఒక కామిడి థ్రిల్లర్. ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మేలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. హీరో సదన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. హీరోయిన్స్ దీపికా, రేఖ నిరోష కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. నిర్మాత బివి.రెడ్డి నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
 
హీరో సదన్ మాట్లాడుతూ, మిమ్మల్ని మెప్పిస్తానని కోరుకుంటున్నాను. మంచి కథ కథనాలతో భారీ తారాగణం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. మాకు ఎంకరేజ్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలుపుతున్నాము అన్నారు.

హీరొయిన్ దీపికా మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బి.వి రెడ్డికి ధన్యవాదాలు. హీరో సదన్‌తో కలిసి నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.

నిర్మాత బివి రెడ్డి మాట్లాడుతూ, మా సినిమా భారీ తారాగణం ప్రారంభ కార్యక్రమానికి  విచ్చేసిన అలీకి, ఎస్వీ.కృష్ణారెడ్డికి, అచ్చిరెడ్డికి, ఎమ్ఎమ్.శ్రీలేఖకి ధన్యవాదాలు. మమ్మల్ని సపోర్ట్ చేసి మా సినిమాను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. లవ్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతొందని తెలిపారు.
 
నటీనటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: బివిఆర్ పిక్చర్స్
నిర్మాత: బివి.రెడ్డి
డైరెక్టర్: శేఖర్ ముత్యాల
కెమెరామెన్: ఎమ్.వి.గోపి
సంగీతం: సుక్కు
ఆర్ట్ డైరెక్టర్: జే. కె.మూర్తి
పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ ప్రసాద్
పిఆరోఓ: మధు.విఆర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ మరణంపై ఫేక్ న్యూస్, రూ. 15 లక్షల ఆర్జన: అక్షయ్ కుమార్ రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీస్