చంద్రుడి ఉపరితలపై నుంచి నమూనాల సేకరణ కోసం చైనా ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం చాంగ్-5 అనే పేరుతో ఓ మిషన్ ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది.
అయితే, చైనా ఈ తరహా అంతరిక్ష ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చాంగ్-5ను చైనా అతిపెద్ద వాహకనౌక 'లాంగ్ మార్చ్-5' కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తమకు అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం ఇదేనని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పైగా, 1970 తర్వాత చేపట్టే తొలి ప్రాజెక్టు ఇదే.
గతంలో భారత్ చంద్రమండలం దక్షిణ ధృవం అధ్యయనం కోసం చంద్రయాన్ పేరుతో ఓ బృహత్తర ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. అయితే, ఇది చివరి క్షణాల్లో విఫలమైంది. దీంతో మరోమారు ఇదే తరహా ప్రాజెక్టును చేపట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది.