Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

దేవీ
మంగళవారం, 6 మే 2025 (20:21 IST)
Vijay Deverakonda, cricketer Tilak Verma
తన కొత్త సినిమా "కింగ్డమ్" రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ ను డిఫరెంట్ గా చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన తాజాగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో కలిసి పికిల్ బాల్ మ్యాచ్ ఆడారు.  ఈ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ త్రీలో త‌న‌ను ఓడిస్తే ముంబయి ఇండియ‌న్స్ జెర్సీ వేసుకుంటాన‌ని తిల‌క్ వ‌ర్మ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఛాలెంజ్ విసిరారు. ఈ పికిల్ బాల్ మ్యాచ్ లో 2-1తో విజయ్ టీమ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ వీడియోను ముంబై ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
 
ఈ వీడియోకు పెద్ద ఎత్తున నెటిజన్స్, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. విజయ్ కూడా ఈ వీడియోకు స్పందిస్తూ తన కొత్త సినిమా కింగ్డమ్ లోని హృదయం లోపల సాంగ్ కు రీల్ చేయాలని తిలక్ వర్మ, రాజంగడ్ ను కోరారు. హైదరాబాద్ లో జరిగే ప్లేఆఫ్స్ కు వస్తానని, ముంబయి టీమ్ ను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఈ రోజు (మంగళవారం) వాంఖేడే స్డేడియంలో గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ పోరుకు రెడీ అవుతోంది.
 
“కింగ్డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. “కింగ్డమ్” సినిమా ఈ నెల 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments