Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై వేదికగా ఐదో టీ20 మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

Advertiesment
surya - joss

ఠాగూర్

, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:53 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను బ్యాటింగ్‌కు తొలుత ఆహ్వానించాడు. మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల టోర్నీని భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. నామమాత్రమైన ఐదో టీ20లో కూడా విజయం సాధించి ఈ సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్‌లో ఒక మార్పు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకున్నారు. 
 
భారత జట్టు : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, రింకు సింగ్, శివమ్ దూబె, హార్దిక పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి. 
 
ఇంగ్లండ్ : ఫీల్ సాల్ట్ బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతల్ బ్రైడన్ కార్స్, జెమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదరగొట్టిన త్రిష - మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ టైటిల్ భారత్ వశం