Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో తండ్రి పాత్రలో రానున్న విజయ్ దేవరకొండ..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:38 IST)
అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండ లైఫ్ స్టైలే మరిపోయింది. దానికి తోడుగా మరో సినిమా చేశారు. అదే నండి.. గీతా గోవిందం చిత్రం.. అసలు ఈ సినిమా గురించి మాటల్లో చెప్పలేం. ఈ సినిమా రీలిజ్ తరువాత ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుతున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలోని 'ఇంకేం ఇంకేం కావాలి' సాంగ్‌కి పిచ్చ పిచ్చగా ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ విన్నా కూడా విజయ్ దేవరకొండే గుర్తుకు వస్తారు. ప్రస్తుతం విజయ్ ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. అందులో విజయ్ 8 ఏళ్ల అబ్బాయికి తండ్రిగా కనిపించనున్నారు.
 
అందుకు కారణమేమిటో తెలుసుకోవాంటే.. చిత్రాన్ని చూడాల్సిందేనని దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం 15 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇందులో విజయ్.. సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్‌గా నటిస్తున్నాడు. మరోవైపు ప్రేమకథ కూడా ఉంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్, ఇజబెల్లి హీరోయిన్స్‌గా నడిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్వ రాజేష్ తన పాత్ర తాలూకు షెడ్యూలు పూర్తి చేసింది. అలానే గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె. ఎస్ రామారావు గారు నిర్మిస్తున్నారు.    
 
ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్యాచ్ ఫైనల్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments