Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీపై మనసుపారేసుకున్నా... తప్పకుండా చేస్తా : టాక్సీవాలా

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (18:02 IST)
అతిలోకసుందరి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్. 'దఢక్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఈమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. కానీ, జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
నిజానికి టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ జాన్వీకి రాగా, ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకొచ్చింది. కానీ, ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే ఏ నటుడిగా మారాలని అనుకుంటున్నావు.. ఎందుకు అనే ప్రశ్న జాన్వీకి ఎదురైంది. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అంటే తెలుగు వెండితెరపై కనిపించేందుకు తనకు సరైన జోడీ విజయ్ దేవరకొండేనని ఆమె భావిస్తున్నట్టుగా ఉంది. 
 
ఇదే అంశాన్ని విజయ్ దేవరకొండ వద్ద మీడియా ప్రస్తావించింది. దీనికి ఈ టాక్సీవాలా సమాధానమిస్తూ, "నేను కూడా జాన్వితో, కరణ్ జోహార్‌తో కలిసి అతి త్వరలో పనిచేస్తా. జాన్వీతో నటించాలని నాకూ ఆశగా ఉంద"ని చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, ఇటీవల తాను ముంబైకు వెళ్లి కరణ్ జోహార్ ఆఫీసుకు వెళ్లాను. ఆయన ఆఫీస్‌లో కూర్చొన్నపుడు నేనేంటి ఇక్కడ? అనిపించింది అని విజయ్ వెల్లడించారు. అందువల్ల తమ కాంబినేషన్‌లో తప్పకుండా చిత్రం ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా, విజయ్ నటించిన తాజా చిత్రం 'టాక్సీవాలా'. ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇపుడు "డియర్ కామ్రేడ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments