విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పాఠశాలలో హెడ్మాస్టర్ ఒకరు ఒక మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	నాగర్ కోయిల్‌కు సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక్కడ సుదాంగన్ అనే వ్యక్తి హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన సుబ్బు అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈయన కూడా టీచరే. వీరిద్దరూ సెలవు దినాల్లో ప్రత్యేక క్లాసులు ఉన్నాయని ఇంట్లో చెప్పి పాఠశాలకు వచ్చేవారు. 
 
									
										
								
																	
	 
	వీరిద్దరూ వచ్చే సమయంలో ఓ మహిళను కూడా తమ వెంట తీసుకొచ్చేవారు. ఆ తర్వాత గదిలోకి మహిళను ఒకరు తీసుకెళితే మరొకరు గదికి తాళం వేసి బయట కాపలాగా ఉండేవారు. ఆ మహిళతో ఒకరు రాసలీలలు ముగించిన తర్వాత మరొకరు వెళ్లేవారు. ఈతంతు చాలాకాలంగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చింది. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఈక్రమంలో ఒక రోజున ఆ మహిళ తనతో పాటు తన కుమారుడిని కూడా పాఠశాలకు తీసుకొచ్చింది. ఆ మహిళను హెడ్మాస్టర్ తన గదిలోకి తీసుకెళ్ళగానే, సుబ్బు గదికి తాళం వేశాడు. దీన్ని గమనించిన బాలుడు ఏడుపు లంకించుకోవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని టీచర్ సుబ్బుతో గది తెరిపించగా ఆ మహిళతో హెడ్మాస్టర్ రాసలీలల్లో మునిగిపోయివుండటాన్ని గుర్తించారు. దీంతో స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హెచ్.ఎంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.