Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ విక్రమ్ రాథోడ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (16:15 IST)
Vijay Antony
కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు విజయ్ ఆంటోనీ. విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా విక్రమ్ రాథోడ్ సినిమా తెలుగులో రాబోతోంది. 
 
అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, S కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
 
ఈ పోస్టర్ లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. సీరియస్ లుక్ లో ఆయన కనిపిస్తుండటం, ఎవరో పిస్తోల్ తో ఆయన్ను గురిపెట్టడం చూపిస్తూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించారు. శ్రీ శివ గంగ ఎంటర్‌ ప్రైజెస్ సంస్థ (K బాబు రావు) ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments