Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాక్సిడెంట్ తర్వాత చెప్పింది అదే, బిచ్చగాడు3 చేస్తాం : ఫాతిమా, విజయ్ ఆంటోనీ

Advertiesment
Vijay Antony
, సోమవారం, 29 మే 2023 (09:43 IST)
Vijay Antony
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా బిచ్చగాడు2. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని బిచ్చగాడు2 థియేటర్స్ కు వెళ్లి సందడి చేసింది మూవీ టీమ్. అలాగే రాజమండ్రి లో నిజమైన బిచ్చగాళ్లకు ఓ స్టార్ హోటెల్లో విందు కూడా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ ను వైజాగ్ లో ఏర్పాటు చేశారు.
 
నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. " ఒక వారం రోజులుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు జ్వరంతో గొంతు పోయింది. కానీ మీ అందరినీ చూడగానే జ్వరం పోయింది.  దేవుడితో పాటు మీ అందరికీ థ్యాంక్యూ. మీరు లేకపోతే విజయ్ ఆంటోనీ, ఫాతిమా ఎవరూ లేరు. యాక్సిడెంట్ తర్వాత చెప్పింది ఏంటంటే.. నో టియర్స్ (కన్నీళ్లు) ఓన్లీ హ్యాపీనెస్. ఇప్పుడు అదే చేస్తున్నా.. ఇప్పుడు నో టియర్స్.. ఫుల్ హ్యాపీ. ఏదీ అప్పుడు ప్లాన్ చేయలేదు. అలా జరిగిపోయింది. ఇక తెలుగులో డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యాం. ఈ చిత్రాన్ని ఎవరైతే ప్రేక్షకుల దగ్గరకు బాగా తీసుకువెళ్తారా అనుకున్నాం. అప్పుడు చాలామంది వచ్చారు. కానీ నాకు ఎవరూ నచ్చలేదు. ఒక ఇద్దరు మాత్రం ప్రొడ్యూసర్స్ నాకు తండ్రిలా, బ్రదర్ లా నచ్చారు. వారిని చూశాక నమ్మకం కలిగింది. వీళ్లు సినిమాకు ఆడియన్స్ ముందుకు తీసుకువెళతారు అని. సినిమా స్టార్ట్ చేయడానికి ముందే మాకు సపోర్ట్ గా ఉన్నారు. తండ్రిలా ముందుండి నడిపించారు. ప్రేక్షకులతో పాటు ఈ జర్నీలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.. " అన్నారు.
 
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..  మీ అందరికీ బిచ్చగాడు నచ్చింది. సపోర్ట్ చేశారు. ఇప్పుడు బిచ్చగాడు2 నచ్చింది.. మంచి విజయం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. బిజీ షెడ్యూల్ కారణంగా కుదరడం లేదు. నెక్ట్స్ టైమ్ ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను. ఈ సందర్భంగా ఓ సంతోషకరమైన వార్త షేర్ చేసుకుంటున్నాను. త్వరలోనే బిచ్చగాడు3 చేయబోతున్నాను. బిచ్చగాడు3 మూవీ 2025 లేదా 2026 బిగినింగ్ లో విడుదలవుతుంది.  ఈ విజయం నా ఒక్కడిది కాదు. నా టీమ్ మొత్తం సపోర్ట్ చేసింది. నా భార్య ఫాతిమా సపోర్ట్ మరవలేను. నా అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఏ విజయాన్ని మనం ఒక్కరమే ఓన్ చేసుకోలేం. ప్రతి విజయంలో భాగస్వాములు ఉంటారు. ఉషాపిక్చర్స్ వీరి నాయుడు గారు ప్రతి సందర్భంలో సపోర్ట్ గా ఉన్నారు. వారితో పాటు సురేష్‌, విజయ్ బాబు, అండగా నిలిచారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇల్లు కొంటాను. నా సినిమాల షూటింగ్స్ కూడా ఆంధ్రా, తెలంగాణలో షూటింగ్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. ఈ సక్సెస్ మీట్ విజయవంతం కావడానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వ కృతజ్ఞతలు చెబుతున్నాను.. " అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ చరణ్ తాజా సినిమా ది ఇండియా హౌస్ ప్రకటన