Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాలు ఎలా ఉండాలో చూపించిన 2018, బిచ్చగాడు

Advertiesment
2018, bichagadu 2
, శనివారం, 3 జూన్ 2023 (16:35 IST)
2018, bichagadu 2
గత నెలనుంచి చూసుకుంటే తెలుగు సినిమాలు కథ లేకుండా. సిల్లీ కామెడీ తో కలెక్షన్స్ రాబట్టుకోవాలని చూశాయి. అవి చెత్త బుట్ట సినిమాలుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వాటిని అలా అనకూడదని కొందరు దర్శుకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ  వాదనలో తమిళ్ డబ్బింగ్ సినిమాలకు  పెద్ద పేట వేశారు సినీ పెద్దలు, ప్రేక్షకులు. 
 
వేసవి లాంటి సీజన్‌లో తెలుగు సినిమా  దుస్థితిని తెలియజేస్తాయి. 2018 – ఈ చిత్రం ప్రారంభ వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం మాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్, డబ్ చీసి విడుదల AP/TSలో మంచి బిజినెస్ చేసింది. మలయాళ డబ్ చిత్రం మన్యం పులిని బీట్ చేసి కేరళలో కూడా ఈ చిత్రం బీట్ చేసిన అత్యధిక వారాంతం ఇది. ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌ను తీసుకువెళుతోంది. 
 
బిచ్చగాడు2 - నూదవ వారాంతంలో 3 కోట్ల షేర్‌ని జోడించి మంచి రన్‌ను కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 10 రోజుల షేర్ 10 కోట్లకు బాగానే వచ్చింది. . సినిమా థియేట్రికల్ రైట్స్ ఖర్చుతో సహా 6 కోట్ల రూపాయలకు చేరాయి.  ఈ చిత్రం సులభంగా ఆ మార్క్‌ను దాటింది మరియు కొనుగోలుదారులకు మంచి లాభాలను అందించింది. ఈ ఆదరణతో పార్ట్ 3 కూడా తీస్తానని హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ ప్రకటించారు. 
 
విశేషం ఏమంటే రెండు సినిమాలకు పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. వారం ముందు తమ సినిమాలు విడుదలని ప్రెస్ మీట్ పేట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెంటిల్‌మన్ 2 ద్వారా తమిళ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్న ఎం.ఎం. కీరవాణి