Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ శ్రీ‌రామ్ పాడిన‌ `సెహరి`లోని వీడియో సాంగ్‌ విడుదల

Webdunia
గురువారం, 29 జులై 2021 (16:08 IST)
Harsh Kanumilli, Simran Chaudhary,
హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, టైటిల్‌ సాంగ్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  తాజాగా ఈ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌  ‘ఇది చాలా బాగుందిలే’ లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌ విహారి మ్యూజిక‌ల్ మ్యాజిక్‌ మరోసారి రిపీటైంది. ‘ఇది చాలా బాగుందిలే’ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.
 
హీరో హర్ష్‌ అదిరిపోయే స్టెప్పులతో ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ యూత్‌ఫుల్‌ ట్రాక్‌గా నిలవగా, ఈ చిత్రంలోని సెకండ్‌ సాంగ్‌ ‘ఇది చాలా బాగుందిలే’ సోల్‌ఫుల్‌ మెలోడిగా వినిపిస్తుంది. తన అద్భుతమైన గాత్రంతో సిద్‌ శ్రీరామ్‌ మరోసారి తన మ్యూజిక్‌ను ఈ సాంగ్‌ కోసం రిపీట్‌ చేశారు. ‘ఇది చాలా బాగుందిలే’ పాటకు కిట్టు విస్సా ప్రగాడ సాహిత్యం అందించారు. హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరిపై తన లవ్‌బుల్‌ ఫీలింగ్‌ను చెప్పే క్రమంలో ‘ఇది చాలా బాగుందిలే’ పాట వస్తుంది. వెండితెరపై హర్ష్, సిమ్రాన్‌ల జోడీ, కెమిష్ట్రీ ప్లెజెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయనడంతో సందేహం లేదు. హర్ష్‌ తన అద్భుతమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో, తన అందమైన లుక్స్‌తో సిమ్రాన్‌ వెండితెరపై అదుర్స్‌ అనిపిస్తారు.
 
యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తుండటం విశేషం.
 
నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ
 
సాంకేతిక విభాగం
దర్శకుడు: జ్ఞానసాగర్‌ ద్వారక
ప్రొడ్యూసర్స్‌: అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి
డీఓపీ: అరవింద్‌ విశ్వనాథ్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రశాంత్‌ ఆర్ విహారి
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments