హీరో అనగానే పెద్ద పెద్ద కటౌట్లు, థియేటర్లో సినిమా విడుదలయితే రెడ్ కార్పెట్ పెట్టి, టపాసులు కాల్చి ధూమ్ ధాంగా హడావుడి చేస్తుంటారు. కానీ తనకు ఇది చాలు అన్నట్లు హీరో సత్యదేవ్ చెబుతున్నాడు. రేపు అనగా జూలై 30న ఆయన నటించిన `తిమ్మరుసు` విడుదల కాబోతుంది. అందుకే ఆర్‌టి.సి. క్రాస్ రోడ్‌లోని దేవీ 70.ఎం.ఎం. థియేటర్‌ను ముందుగానే సందర్శించి అక్కడి వాతావరణాన్ని పరిశీలించారు. కారు పార్కింగ్ దగ్గర, మెయిన్ గేటు దగ్గర ఇలా చూపించినట్లుగా పోస్టర్టు పెట్టారు. దీనికే ఆయన మురిసిపోతున్నారు.
మరి పెద్ద కటౌట్ పెట్టుకోవాలని ఏ హీరోకైనా వుంటుందికదా. ఇలాంటి టైంలో పెద్ద హీరోల సినిమాలు లేని టైంలో పెట్టుకోవచ్చుగదా అని సత్యదేవ్‌ను అడిగితే, నవ్వుతూ మనకు ఇది చాలు. ఇంకా ముందు ముందు వుంది మన కాలం అంటూ తెలియజేస్తున్నాడు. అసలే కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు. ప్రేక్షకులు వస్తారో రాలో అనే ఒక టెన్షన్‌కూడా ఆయనకూ వుంది. ఇదే టెన్షన్ రేపు విడుదలకాబోయే మరికొన్ని సినిమాలకూ వుంది. కానీ ప్రేక్షకులు మాల్స్‌కూ, బయట మార్కెట్లలో ధైర్యంగా తిరుగుతున్నారు కాబట్టి థియేటర్లకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మొదటి ఆట పడుతుందనీ,, అందులో దేవి ముందుగా ఉంటుదని సత్యదేవ్ తెలిపారు.