Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌టౌట్‌కు ఇంకా టైం వుంది- ప్ర‌స్తుతానికి ఇదిచాలంటున్న స‌త్య‌దేవ్‌

Webdunia
గురువారం, 29 జులై 2021 (15:59 IST)
Sathadev theater
హీరో అన‌గానే పెద్ద పెద్ద క‌టౌట్లు, థియేట‌ర్లో సినిమా విడుద‌ల‌యితే రెడ్ కార్పెట్ పెట్టి, ట‌పాసులు కాల్చి ధూమ్ ధాంగా హ‌డావుడి చేస్తుంటారు. కానీ త‌న‌కు ఇది చాలు అన్న‌ట్లు హీరో స‌త్య‌దేవ్ చెబుతున్నాడు. రేపు అన‌గా జూలై 30న ఆయ‌న న‌టించిన `తిమ్మ‌రుసు` విడుద‌ల కాబోతుంది. అందుకే ఆర్‌టి.సి. క్రాస్ రోడ్‌లోని దేవీ 70.ఎం.ఎం. థియేట‌ర్‌ను ముందుగానే సంద‌ర్శించి అక్క‌డి వాతావర‌ణాన్ని ప‌రిశీలించారు. కారు పార్కింగ్ ద‌గ్గ‌ర‌, మెయిన్ గేటు ద‌గ్గ‌ర ఇలా చూపించిన‌ట్లుగా పోస్ట‌ర్టు పెట్టారు. దీనికే ఆయ‌న‌ మురిసిపోతున్నారు.
 
మ‌రి పెద్ద క‌టౌట్ పెట్టుకోవాల‌ని ఏ హీరోకైనా వుంటుందిక‌దా. ఇలాంటి టైంలో పెద్ద హీరోల సినిమాలు లేని టైంలో పెట్టుకోవ‌చ్చుగ‌దా అని స‌త్య‌దేవ్‌ను అడిగితే, న‌వ్వుతూ మ‌న‌కు ఇది చాలు. ఇంకా ముందు ముందు వుంది మ‌న కాలం అంటూ తెలియ‌జేస్తున్నాడు. అస‌లే క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్లు ఓపెన్ చేస్తున్నారు. ప్రేక్ష‌కులు వ‌స్తారో రాలో అనే ఒక టెన్ష‌న్‌కూడా ఆయ‌నకూ వుంది. ఇదే టెన్ష‌న్ రేపు విడుద‌ల‌కాబోయే మ‌రికొన్ని సినిమాల‌కూ వుంది. కానీ ప్రేక్ష‌కులు మాల్స్‌కూ, బ‌య‌ట మార్కెట్ల‌లో ధైర్యంగా తిరుగుతున్నారు కాబ‌ట్టి థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మొదటి ఆట పడుతుంద‌నీ,, అందులో దేవి ముందుగా ఉంటుదని స‌త్య‌దేవ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments