Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేష్ సైంధవ్ కీలక షెడ్యూల్ పూర్తి

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (18:32 IST)
Venkatesh at Saindhav set
విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
చిత్ర యూనిట్ తాజాగా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఇతర తారాగణం సెట్స్ లో వున్న వీడియోని పంచుకున్నారు మేకర్స్. నెక్స్ట్ ఫైనల్ మిషన్ వైపు దూసుకు వెళ్తున్నట్లు  మేకర్స్ తెలియజేశారు.
 
ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కనిపిస్తోంది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

6G: టెక్నాలజీ పెరిగిపోతున్నా.. డిజిటల్ డార్కులో వున్న తెలంగాణ స్కూల్స్

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments