Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద రుణ మేళాను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

image
, మంగళవారం, 23 మే 2023 (15:57 IST)
భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో రుణ మేళాను నిర్వహించింది. దాదాపు 3,500 మంది వినియోగదారులు ఏలూరులో నిర్వహించిన ఇటువంటి అతిపెద్ద రుణ మేళాకు హాజరయ్యారు. ఇందులో చిన్న మరియు సన్నకారు రైతులు, ఎఫ్‌పీఓలు, అగ్రి స్టార్టప్‌లు, చిన్న అగ్రి వ్యవస్థాపకులు, ట్రాన్స్‌పోర్టర్లు, దుకాణదారులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు మరియు ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఉన్నారు. బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ (CRB) గ్రూప్ ద్వారా నిర్వహించిన మేళాలో తన ఉత్పత్తులు, సేవల అవలోకనాన్ని అందించింది. వినియోగదారులతో సహా 14,000 మంది వ్యక్తుల జీవితాలలో మార్పులను అందించే దిశలో వేల మంది వినియోగదారుల కుటుంబాలకు రుణ మంజూరు లేఖలను బ్యాంకు అందించింది.
 
ఉత్పత్తులు మరియు సేవల్లో అగ్రికల్చర్ ఫైనాన్స్, హెల్త్‌కేర్ ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ వెహికల్ ఫైనాన్స్, కమర్షియల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ మరియు దుకాణ్‌దార్ ధమాకా ఉన్నాయి. ఎంఎస్‌ఎంఇలు మూలధన పెట్టుబడి, టర్మ్ లోన్‌లు, ఎల్‌సీ మరియు బ్యాంక్ గ్యారెంటీలను పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ -సిఆర్‌బి రాహుల్ శ్యామ్ శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లాధికారి మరియు జిల్లా మెజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి వి.ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు.
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిఆర్‌బి గ్రూప్ హెడ్ రాహుల్ శ్యామ్ శుక్లా మేళాను ప్రారంభించి మాట్లాడుతూ, “కృష్ణా-గోదావరి ప్రాంత ఆర్థిక వృద్ధికి సహకరించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. నేడు, మన చిన్న వ్యాపారాలు- రైతులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ సదుపాయాలు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవు. ఇప్పటికీ 6-7 కోట్ల మంది చిన్న రైతులు- దుకాణదారులు అనధికారిక వ్యవస్థ నుంచి అధిక ధరకు రుణాలను తీసుకుంటున్నారు. ఈ మేళా బ్యాంకింగ్‌ను అవసరమైన వారికి చేరవేసేందుకు, గ్రామీణ శ్రేయస్సుకు దోహదపడే దిశగా ఒక అడుగు ముందుకు వేస్తోంది. బ్యాంక్‌గా, మా పరిణామం మెట్రో నుంచి పట్టణానికి, ఆపై సెమీ అర్బన్ నుంచి గ్రామీణ భారతదేశానికి కొనసాగుతోంది. బ్యాంక్ 688 జిల్లాల్లోని ఎస్ఎంఈలకు రుణాలను అందిస్తూ, దాదాపు 2 లక్షల గ్రామాలకు అగ్రి ఫైనాన్స్ అందించేందుకు శ్రమిస్తోంది’’ అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైనోసార్స్: పెట్రోల్, డీజిల్‌లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?