ఎన్ టి. ఆర్. గారి గొప్ప మానవతా వాది. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. మంచి పరిపాలన దక్షుడు. అందుకే నాన్నగారి శత జయంతి ఉత్సవాలు శతాబ్దం జరగాలి అని పురందరేశ్వరి దేవి అన్నారు. శనివారం హైదరాబాద్ కూకట్ పల్లి లోని కిట్ల పూర్లో జరిగిన వేడుకలో ఆమె మాట్లాడారు. ఈ వేడుకకు చంద్రబాబు, శివరాజ్ కుమార్, వెంకటేష్, చైతు, మురళీమోహన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
NT. R. Gari's centenary celebrations
గ్లోబల్ స్టార్ది రాంచరణ్ లెజెండ్ ఎన్ టి. ఆర్. గారితో మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. నన్ను ఈ స్థాయికి చేర్చిన ఎన్ టి. ఆర్. గారి రుణాన్ని ఈ విధంగా తీర్చుకునే అవకాశం లభించడం నా అదృష్టం గా భావిస్తున్నానని డి. జనార్దన్ తెలిపారు. శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న యుగపురుషుడు ఎన్ టి. ఆర్. గారికి భారతరత్న బిరుదు ప్రకటించాలి అని ఆశిస్తున్నానని మురళీమోహన్ చెప్పారు.
ఆయనతో షూటింగ్ చేసిన ప్రతి రోజు ఎంతో స్ఫూర్తిగా ఉండేదని జయసుధ అన్నారు. అప్పటికీ , ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిన దేవుడు అని జయప్రద తెలిపారు.
రాముడు, కృష్ణుడు అని ఎవరైనా నా ముందు అంటే వెంటనే మనసులోకి వచ్చే వ్యక్తి ఎన్ టి. ఆర్. గారిఅని నాగ చైతన్యు తెలిపారు. ఎన్ టి. ఆర్. గారి ని చూడకపోయినా బాలకృష్ణ గారు షూటింగ్లో ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్తుంటే చాలా ఇంస్ప్రింగ్ గా ఉండేదని
సుమంత్ అన్నారు.. ఇలా ఎందరో తమ జ్ఞ్యాపకాలు గుర్తుచేసుకున్నారు.