సీనియర్ నటుడు వీర భద్రయ్య ఇటీవలే హైదరాబాద్ లో ఇంటిలోనే ప్రమాదానికి గురై తీవ్ర అస్వస్థత గురైన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోమాలో గుంటూరు దగ్గర తన ఊరిలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన సినీ నటుడు,మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్. తాజాగా సినీ, టీవీ నటుడు డీ. వీరభద్రయ్యకు ఆర్థిక సాయం చేశారు.
Veteran actor Veera Bhadraiah,
పదేళ్లుగా మనం సైతం' ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూనే ఉన్నారు.
కరోనా టైములో కార్మికులకు అండగా నిలిచారు. ఇటీవలే పావలా శ్యామలకు 25,000 చెక్కును ఆర్థిక సాయంగా అందించారు.
నేడు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురై ఆందోళనకరమైన పరిస్థితుల్లో హస్పిటల్‌లో చేరిన సినీ, టీవీ నటుడు డీ. వీరభద్రయ్యకు రూ. 25,000 చెక్కును ఆర్థిక సాయంగా అందించారు. వీరభద్రయ్యకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా ఈ సాయం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీ. వీరభద్రయ్య కుటుంబానికి అండగా ఉంటానంటూ వారిలో ధైర్యం నింపారు. ఇలా నిరంతరం దాతృత్వం కొనసాగిస్తున్న ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.