Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : విద్యార్థులకు ఉచిత ప్రవేశం... ఎక్కడ?

Advertiesment
uppal stadium

ఠాగూర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (13:41 IST)
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు స్వదేశానికి రానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ మ్యాచ్ కోసం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
 
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్.సి.ఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు గురువారం ఉప్పల్ స్టేడియం ఆధునీకకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ - ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు.
 
అయితే, విద్యార్థులకు నేరుగా అనుమతి ఉండదని, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ దరఖాస్తులు పంపించాల్సి ఉంటుందన్నారు. తమ పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు? ఎంతమంది సిబ్బంది వస్తున్నారు? అనే వివరాలను ప్రిన్సిపాల్స్ దరఖాస్తుల్లో స్పష్టంగా పేర్కొనాలని వివరించారు.
 
తాము ఆ దరఖాస్తులు పరిశీలించి స్కూళ్లకు కాంప్లిమెంటరీ పాసులు పంపిస్తామని హెచ్.సి.ఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు వివరించారు. కాంప్లిమెంటరీ పాసులతో వచ్చే విద్యార్థులు స్కూలు యూనిఫాం ధరించి రావాలని, విద్యార్థులకు ఉచితంగా భోజనం, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 
 
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్‌కు జైలుశిక్షి.. కెరీర్ ముగిసినట్టే!! 
 
మైనర్ బాలిక అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ ఒకరికి ఎనిమిదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ స్థాని కోర్టు తీర్పునిచ్చింది. సందీప్ లామిచానే అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలడంతో కోర్టు జైలుశిక్షతో పాటు అపరాధం కూడా విధించింది. అయితే, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ క్రికెటర్ హైకోర్టులో అప్పీలే చేయనున్నట్టు తెలిపారు. 
 
ఇపుడిపుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాణిస్తున్న నేపాల్ క్రికెట్ జట్టులో ఎంతో ప్రతిభావంతుడిగా పేరుపొందిన స్టార్ లెగ్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే మైనర్ బాలిక అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. దీంతో అతనికి నేపాల్‌లోని ఖాట్మండ్ జిల్లా కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
 
ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. దీంతో లామిచానేపై కేసు నమోదైంది. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న లామిచానేపై అప్పట్లో ఇంటర్ పోల్ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో లామిచానే బయటికి రాక తప్పలేదు.
 
ఇంటర్ పోల్ సాయంతో లామిచానేను ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్ పోర్టులో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోనే అతడికి శిక్ష పడింది. అంతేకాదు, జరిమానా కింద కోర్టుకు 3 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని, బాధితురాలికి పరిహారం కింద 2 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లామిచానే బెయిల్ మీద బయట ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్‌తో తొలి టీ-20లో భారత్ గెలుపు- రోహిత్ అరుదైన రికార్డ్