ఆప్ఘనిస్థాన్‌తో మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్‌పై అఫ్గాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
అనంతరం ఛేదనకు వచ్చిన భారత్ 17.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున రోహిత్ ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడగా 100 సార్లు గెలుపు రుచి చూశాడు.