Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు స్వామిని వెనకేసుకొచ్చిన భార్య.. మీడియాపై చిందులు.. తప్పేంటని ప్రశ్న!

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (14:30 IST)
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. నాగచైతన్య శోభిత విడాకులపై ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్టులు తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన భార్య ఎంట్రీ ఇచ్చారు. 
 
మీడియాపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది. తాను కూడా జర్నలిస్ట్ అంటూ.. ప్రస్తుతం ఉన్న మీడియా ఛానల్స్‌ను తిడుతూ… వీణా శ్రీవాణి ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.
 
సెలబ్రిటీలు విడిపోతారా కలిసుంటారా అని జ్యోతిష్యం చెప్పే తన భర్త కన్నా.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూసే మీడియా ఛానల్స్‌ను ముందు ప్రశ్నించాలని వీణా శ్రీవాణి అన్నారు. 
 
అంతేకాదు.. తన భర్త చేసినదాంట్లో ఎలాంటి తప్పు లేదంటూ ఆమె కవరింగ్ చేస్తూ.. మీడియా ఛానల్స్ తీరుపై ఫైర్ అయ్యింది. తనకు మంచు విష్ణు కూడా కాల్ చేసి ఇదే విషయం అడిగారని.. ఒక్క సినిమా కోసం వందలమంది పని చేస్తారని.. తప్పుడు రివ్యూలు రాసి.. సినిమాలు హిట్ కాకుండా చేస్తున్న జర్నలిస్టులను మీడియాను మంచు విష్ణే ప్రశ్నించాలని వేణు స్వామి భార్య డిమాండ్ చేశారు.
 
ఈ వీడియోలో వేణు స్వామి గురించి కానీ అతని జోస్యం గురించి తప్పు చెప్పలేదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై ఆమె మీడియాకు అవగాహన కల్పించారు. సినిమా రివ్యూలు, టీవీ డిబేట్లు, రాజ్ తరుణ్ ఇష్యూ, తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఆమె మాట్లాడారు. కానీ వేణు స్వామి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే వీణా శ్రీవాణి వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments