Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బాద్‍షా షారూక్‌ను వెనక్కి నెట్టిన శోభిత ధూళిపాళ్ల!!

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు నటి శోభిత ధూళిపాళ్ళ.. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ను వెనక్కి నెట్టేసింది. గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వారిలో ఆమె మొదటి స్థానంలో నిలించారు. ఈ మేరకు ఐఎండీబీ ఇండియన్ పాప్యులర్ సెలెబ్రిటీల జాబితాను రిలీజ్ చేశింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో శోభిత ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో విస్తృతంగా సెర్చ్ చేశారు. దీంతో ఆమె ఈ వారం ఐఎండీబీ ఇండియన్ పాప్యులర్ సెలబ్రిటీల జాబితాలో ఒక్కసారిగా పైకి ఎగబాకారు. ఏకంగా బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు.
 
కాగా, ఈ జాబితాలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ అగ్ర స్థానంలో నిలిచారు. ముంజ్యా మూవీ విజయంతో ఆమె క్రేజ్ అమాంతం పెరగడమే ఇందుకు కారణం. ఇక షారూక్ మూడో స్థానం దక్కించుకున్నారు. కింగ్ ఖాన్ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు.
 
అలాగే పారిస్ ఒలింపిక్స్‌‌లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, 'మహారాజ'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ టాప్-10లో చోటు సంపాదించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments