Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబే లక్ష్యంగా వర్మ 'వెన్నుపోటు' పాట (Full Song)

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (13:53 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 
 
'దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు' అంటూ సాగుతున్న లిరిక్స్‌పై సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 
 
సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. బాల‌య్య నిర్మిస్తున్న‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేడుక‌కి కొద్ది నిమిషాల ముందే వెన్నుపోటు అనే సాంగ్‌ని విడుద‌ల చేసి అంద‌రి అటెన్ష‌న్‌ని త‌న‌వైపుకి తిప్పుకున్నాడు. 
 
అయితే, ఈ పూర్తి సాంగ్‌ను విడుదల చేసిన గంటలోనే ఈ సాంగ్‌కి దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న సంఘటనలతో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నాడు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments