Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మూవీ విజ‌యం సాధించాల‌ని కోరుకోను... జూ.ఎన్టీఆర్

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (13:48 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందిన ఎన్టీఆర్ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మూవీ విజ‌యం సాధించాల‌ని కోరుకోను అన్నారు.
 
అవును.. ఇది నిజంగా నిజం. ఎందుకు తార‌క్ అలా అన్నారంటే... చరిత్రకు జయాలు అపజయాలు ఉండవు.. చరిత్ర సృష్టించడాలే ఉంటాయన్నారు. అందుచేత ఎన్టీఆర్ మూవీ విజ‌యం సాధించాల‌ని కోరుకోను అన్నారు. నందమూరి కుటుంబ అభిమానులకు ధన్యవాదాలు. నా పక్కన బాబాయ్ ఇలా నిలబడితే.. ఇన్ని రోజులు బాబాయ్ కనిపించేవారు. ఇప్పుడు పెద్దాయన గుర్తొస్తున్నారు. మాటలు తడబడితే క్షమించండి. నేను ఈ రోజు ఆ మహామనిషి కుటుంబంలో ఒక వ్యక్తిని కావడం ఎంతో గర్వకారణం.
 
కాని నేను ఈ రోజు కుటుంబ సభ్యుడిగా మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడటానికి ఇక్కడకు వచ్చా. ఎందుకంటే.. చిన్నప్పుడు తెలిసీతెలియని వయసులో తాతయ్య గారూ అని సంబోధించిన నేను.. ఆయన గురించి తెలుసుకున్న తరువాత రామారావుగారు, అన్నగారూ అని సంబోధించడం మొదలుపెట్టా. ఎందుకంటే ఆయన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి చెందిన ధృవతార ఎన్టీఆర్ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments