Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్.. అన్నగారిని గుర్తు చేసిన బాలయ్య -#NTR Official Trailer

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్.. అన్నగారిని గుర్తు చేసిన బాలయ్య -#NTR Official Trailer
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (19:33 IST)
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన కుమారుడు, నందమూరి హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో అదరగొట్టారు. రెండు భాగాల్లోనూ ఎన్టీఆర్‌గా ఒదిగిపోయారు.


తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో భాగంగా ప్రదర్శించిన కొన్ని ట్రైలర్ సన్నివేశాలే ఇందుకు కారణం. హైదరాబాద్, ఫిలిమ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెషన్ హాలులో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అతిరథమహారథులు అతిథులుగా విచ్చేశారు. 
 
నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నటి విద్యా బాలన్, దర్శకుడు క్రిష్, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నందమూరి కుటుంబసభ్యులు హాజరైన ఈ ఆడియో వేడుక కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించింది. సినీ ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు.
webdunia
 
తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను ఈ బయోపిక్‌లో పోషిస్తున్న బాలకృష్ణ ఈ కార్యక్రమానికి పట్టువస్త్రాల్లో మెరిసిపోయారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమా మహేశ్వరి ఆవిష్కరించారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ గెటప్స్, ఆయన జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలను దృశ్యాలుగా చూపించారు. పట్టు వస్త్రాలతో ఎన్టీఆర్‌ను పోలిన లుక్‌లో బాలయ్య మెరిసిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకథా చిత్రమ్-2 ట్రైలర్.. హారర్ కామెడీగా అదుర్స్ (వీడియో)