Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్‌ గా గ్వాలియర్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న వరుణ్ తేజ్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:31 IST)
Varun Tej
వరుణ్ తేజ్ హీరోగా కొత్తలో యుద్ధ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా వచ్చింది. ఇది హాలీవుడ్ మూవీ కి రీమేక్. ఇప్పుడు తాగాజా వరుణ్ తేజ్ మరోసారి అటువంటి యుద్ధ నేపథ్య ప్రయత్నం చేస్తున్నారు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈసారి భారతీయ వైమానిక దళ పైలట్‌ గా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా లో  యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ ,VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
 
తెలుగు-హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా పరిచయం చేసిన వీడియో అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ కథానాయిక. రాడార్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది.
 
తాజాగా ఈ సినిమా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయింది. అదే విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు"#VT13 గ్వాలియర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాను! తిరిగి బేస్‌కి వచ్చాను." అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ IAF ఆఫీసర్‌గా కనిపించే ఫోటో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
 
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం దేశభక్తితో కూడుకున్న ఎడ్జ్ అఫ్ సీట్ ఎంటర్ టైనర్. భారతదేశం ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లను చూపుతుంది.
 
శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్ , సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పై సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని ఈ చిత్రానికి సహ నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments