Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

డీవీ
బుధవారం, 29 జనవరి 2025 (17:31 IST)
Varun Tej, Merlapaka Gandhi and producers
వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోర్టర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రానుంది. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వియత్నాంలో శరవేగంగా జరుగుతోంది. 
 
హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ‌తో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్‌ను చూస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
 
వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments