Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

Advertiesment
Varun Tej

డీవీ

, మంగళవారం, 21 జనవరి 2025 (14:32 IST)
Varun Tej
వరుణ్ తేజ్15వ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజైయింది. హ్యుమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ #VT15 చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి.
 
అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఒక ప్రత్యేకమైన కొరియన్ కనెక్షన్‌ను చూపిస్తుంది, దీనిలో ఫైర్ డ్రాగన్ లోగోతో కూడిన జాడి, మంటలతో చుట్టుముట్టబడి వుంది. పోస్టర్ కొరియన్ టెక్స్ట్‌తో సీక్రెట్ ని మరింత పెంచుతుంది. "When haunting turns hilarious!! అనే ట్యాగ్  ప్రత్యేకంగా నిలుస్తుంది - ప్రేక్షకుల కోసం ఎంటర్టైనింగ్ అడ్వంచరస్ జర్నీని సూచిస్తుంది.
 
మేర్లపాక గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాశారు. ఈ ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని పోస్టర్, ట్యాగ్‌లైన్ సూచిస్తోంది. తొలి ప్రేమ భారీ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ  ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది.
 
ఇది దర్శకుడు మేర్లపాక గాంధీ, యువి క్రియేషన్స్‌తో వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. వరుణ్ తేజ్ గతంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విమర్శకుల ప్రశంసలు పొందిన 'కంచె' సినిమా చేశారు. మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు