Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి మైఖెల్ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:28 IST)
varakshmi Sarath Kumar poster
సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
 
సినిమా నుంచి విడుదల చేస్తోన్న ప్రతీ అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.
 
స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
 
సందీప్ కిషన్ పాత్ర  ఎంత ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది.
 
నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
 
ఈ సినిమాలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంక కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments