Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిది అగర్వాల్ కు నో-డేటింగ్ అడ్డంకిగా మారిందా!

Advertiesment
Nidi Agarwal
Nidi Agarwal
నిధి అగ‌ర్వాల్ గురించి సినీ ప్రియుల‌కు తెలియంది కాదు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి మున్నా మైఖేల్ చిత్రంలో కథానాయకురాలి గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. మ‌రోవైపు మోడ‌లింగ్ వైపు దృష్టిపెట్టింది. అయితే 2018లో ఓ హిందీ సినిమా చేస్తున్న‌ప్పుడు సినిమా పూర్తయ్యే వరకు నో-డేటింగ్ నిబంధనపై సంతకం చేయమని నిధిని కోరారు. దానికి అంగీక‌రించి సినిమా పూర్తిచేసింది కూడా.
 
తాజాగా ఇటువంటిదే తెలుగులో కూడా ఎదురైంది. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టన్మెంట్ సంస్థ ఆమెతో సినిమా చేయ‌డానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అందులో గ‌ల్లా జ‌య‌దేవ్ కొడుకు గ‌ల్లా అశోక్ క‌థానాయడు. సినిమా పేరు హీరో. ఈ సినిమా మొద‌ట్టోనే సినిమా పూర్త‌య్యేవ‌ర‌కుఆ నో డేటింగ్ అని రాయించుకున్నార‌ట‌. ఎట్ట‌కేల‌కు సినిమా పూర్త‌యింది. ఈ సంక్రాంతికి సినిమా విడుద‌ల కాబోతుంది. తాజాగా నిధి అగ‌ర్వాల్  ఓ ఫొటో షూట్ చేసింది. లేత గోధుమరంగు బ్లేజర్ డ్రెస్‌లో ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నందున మీ టైమ్‌లైన్‌లో కొంత మెరుపును పొందండి. అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల గురించి చెబుతూ, పాత్ర మేర‌కు ఎటువంటిదైనా పోషిస్తాన‌ని హింట్ ఇచ్చింది. ఈ ఫొటో షూట్ అందులో భాగ‌మేన‌ని నెటిజ‌ర్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాపై ఇంట్రెస్ట్‌తో లెక్చర‌ర్ ఉద్యోగం మానేశా- నిర్మాత‌లు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల