బిగ్ బాస్ పార్టిసిపెంట్ షణ్ముఖ్ నుంచి దూరమైన దీప్తి సునైనా తాజాగా వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఇన్‌స్టా సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. ఇన్నేళ్ల పాటు తాను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని తాను సిద్ధంగా వున్నానని తెలిపింది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కానీ షణ్ముఖ్‌తో విడిపోయి ఆమె తప్పు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెను విడిపోవడానికి గల కారణాల గురించి అడగడం ప్రారంభించారు. ఈ ప్రశ్నలను పట్టించుకోకుండా దీప్తి తన కొత్త పెంపుడు కుక్కను ప్రేక్షకులకు పరిచయం చేయడం ద్వారా టాపిక్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. 
 
									
										
								
																	
	 
	అయితే అది వర్కవుట్ కాలేదు. ఆమె బ్రేకప్‌ను తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. దీప్తి కాసేపు కెమెరా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక లైవ్ సెషన్‌ను ఉన్నట్టుండి క్లోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.